Monday, January 20, 2025

ఆర్‌జెడిలోకి నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

Four AIMIM MLAs join RJD

బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్‌జెడి

పాట్నా: బీహార్‌లోని ఎఐఎంఐఎంకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు బుధవారం ఆర్‌జెడిలో చేరడంతో 243 మంది సభ్యుల అసెంబ్లీలో ఆర్‌జెడి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. తన పార్టీలోకి నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికను ఆర్‌జెడి అగ్రనేత తేజస్వి యాదవ్ స్వాగతించారు. ఎన్‌డిఎ పాలిత రాష్ట్రంలో లౌకిక శక్తుల బలోపేతానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని తన సొంత కారులో తానే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ తేజస్వి అసెంబ్లీకి చేరుకున్నారు. సీకర్ విజయ్ కుమార్ సిన్హాను కలుసుకున్న ఆయన తమను వేరే గ్రూపుగా అసెంబ్లీలో పరిగణించాలని, ఆర్‌జెడిలో తమ చేరికను గుర్తించాలని కోరుతూ ఎంఐఎం ఎమ్మెల్యేలు రాసిన లేఖను అందచేశారు.

దీంతో అసెంబ్లీలో ఆర్‌జెడి సంఖ్యాబలం 80కి పెరిగింది. ఇప్పుడు బిజెపి సంఖ్యాబలం కన్నా మూడు స్థానాలు ఆర్‌జెడికి ఎక్కువగా ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతలోని ఎఐఎంఐఎం పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ ఒక్కరే పార్టీలో ఎమ్మెల్యేగా మిగిలారు. ఆర్‌జెడిలో చేరిన ఎమ్మెల్యేలలో సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్(బైసీ), షానవాజ్ ఆలం(జోకిహాట్), మొహమ్మద్ ఇజార్ ఆస్ఫి(కొచ్చధామన్), మొహమ్మద్ అన్జార్ నయీమీ(బహాదూర్‌గంజ్) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News