Sunday, December 22, 2024

ఎంఎల్ఎ అభ్యర్థిపై దాడి చేసిన నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నాంపల్లి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళపై దాడి చేసిన ముగ్గురు యువకులను ఆసిఫ్‌నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, ఆసిఫ్‌నగర్, అలీ నగర్‌కు చెందిన మహ్మద్ మూసా, సయిద్ సికందర్, మహ్మద్ అలీం, హుస్సేన్ బిన్ గఫూర్ టోలీచౌకికి చెందిన అంజూమ్ బేగం నాంపల్లి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ నెల 1 గంటలకు మురాద్ నగర్, అరబ్‌గల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో నలుగురు నిందితులు మహిళను వేధించడమే కాకుండా ఆమె వద్ద ఉన్న రూ.15,000 నగదు, యాపిల్ ఫోన్‌ను లాక్కున్నారు. అంతేకాకుండా దాడి చేసి రూమ్‌లో వేసి తాళం వేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన నలుగురు నిందితులను ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News