Sunday, December 22, 2024

ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా.. నలుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయింది. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ ఎస్వోటీ, మీర్ పేట పోలీసులు నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులను నరేంద్ర బిష్టోయ్, ప్రవీణ్ బిష్టోయ్, హేమరామ్, రామ్ దేవసీగా గుర్తించారు. ముఠా నుంచి 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ కు బానిసైన వ్యక్తులే డ్రగ్ విక్రేతలుగా మారారని రాచకొండ సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. రాజస్థాన్ లో గ్రాము హెరాయిన్ రూ. 5వేలకు కొని, హైదరాబాద్ లో గ్రాము హెరాయిన్ రూ. 12 వేలకు అమ్ముతున్నారని సిపి వెల్లడించారు. రాజస్థాన్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ లో డ్రగ్స్ తెస్తున్నారని పేర్కొన్నారు. ర్యాపిడో బైక్ సర్వీస్ ద్వారా వినియోగదారులకు డ్రగ్స్ పంపుతున్నారని సుధీర్ బాబు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News