Tuesday, December 24, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 32గ్రాముల కొకైన్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లా, రాజమండ్రికి చెందిన బొమ్మదేవర వీరరాజు అలియాస్ విక్కీ మియాపూర్‌లో ఉంటూ కారు సేల్స్ వ్యాపారం చేస్తున్నాడు. మణికొండకు చెందిన రాజేష్ గోపిషెట్టి వెడ్డింగ్ ప్లానర్, నరేష్ గోపిషెట్టి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు, వీరు ఇద్దరు సోదరులు, ఎపిలోని విజయనగరానికి చెందిన తోట క్రాంతి కుమార్ మణికొండలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. క్రాంతి కుమార్ డ్రగ్స్ తీసుకుంటుండగా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. విచారణ చేయగా తనకు నరేష్ గోపిశెట్టి ఇచ్చాడని తెలిపారు.

అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తన సోదరుడు రాజేష్ గోపిశెట్టి ఇచ్చాడని చెప్పాడు. వెంటనే పోలీసులు మణికొండలోని రాజేష్ గోపిశెట్టి ఇంట్లో తనిఖీలు నిర్వహించి కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను వీరరాజు వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. మియాపూర్‌లో ఉంటున్న వీరరాజు డ్రగ్స్ వినియోగదారుడే కాకుండా విక్రయిస్తున్నాడు.వీరరాజు తరచూ గోవాకి వెళ్లి అక్కడ డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ గ్రాముకు రూ.20,000 నుంచి రూ.30,000లకు విక్రయిస్తున్నాడు. రాజేష్, విక్కీ కలిసి డ్రగ్స్‌ను అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News