Thursday, January 9, 2025

గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

తాండూరు: బీదర్ నుంచి గంజాయి తీసుకువచ్చి తాండూరులో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను తాండూరు పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. తాండూరు పట్టణం మాణిక్‌నగర్‌కు చెందిన డిసిఎం డ్రైవర్ జాదవ్ అరవింద్, గొల్లచెరువు ప్రాంతానికి చెందిన అక్రమ్, ఇందిరానగర్‌కు చెందిన సయ్యద్ ఆసీఫ్, చాకలిబాబు నలుగురు కలిసి బీదర్ నుంచి గంజాయి తీసుకువచ్చి తాండూరులో ప్యాకెట్లు చేసి విక్రయించేందుకు విల్యామూన్ హైస్కూల్ వద్ద పంచుకుంటుండగా ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డితోపాటు తహాశీల్దారు సమక్షంలో తనిఖీలు నిర్వహించి పట్టుకోవడం జరిగిందని సిఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. కిలోపైన గంజాయిని స్వాధినం చేసుకోవడంతోపాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. తాండూరులో ఉన్నటువంటి యువత ఎవరు కూడా గంజాయి అమ్మటం గాని, తీసుకోవడం కాని చేస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News