Thursday, January 23, 2025

గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సులభంగా డబ్బులు సంపాదించాలని గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 5.6కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సంఘారెడ్డి జిల్లా, గుమ్మిడాలకు చెందిన మహ్మద్ అర్షద్ ఖాన్, రామావత్ రాహుల్, మహ్మద్ ఇర్షాద్ ఖాన్, మహ్మద్ మజహర్ అహ్మద్ కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. అర్షద్ ఖాన్, ఇర్షాద్ ఖాన్ సోదరులు, వారికి మిగతా ఇద్దరు స్నేహితులు. గతంలో అర్షద్ మారేడుమిల్లికి చెందిన ఓ వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయించాడు. దీంతో సులభంగా డబ్బులు వచ్చాయి. ఈ వ్యాపారం వల్ల సులభంగా డబ్బులు వస్తున్నాయని తన సోదరుడు, మిగతా స్నేహితులను గంజాయి దందాలోకి దింపాడు.

అందురు కలిసి మారేడుమిల్లికి చెందిన సుఖ్‌దేవ్ వద్ద రూ.16,000 చెల్లించి 5.6కిలోల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. దానిని చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి విక్రయించేందుకు ప్లాన్ వేశారు. అక్కడి నుంచి కొత్తగూడెంకు బస్సులో వచ్చి అక్కడి నుంచి రైలులో సికింద్రాబాద్‌కు వచ్చారు. అడ్డగుట్లకు రైలు రాగానే అర్షద్ ఖాన్, రామావవద్ రాహుల్ కిందకు దిగి 3.5కిలోల గంజాయిని మజహర్, ఇర్షాద్‌కు అప్పించారు. తర్వాత ఎండి అర్షద్ ఖాన్, రామావత్ రాహుల్ 2.1కిలోల గంజాయిని తీసుకుని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ సైదులు, ఎస్సైలు అశోక్ రెడ్డి, గగన్‌దీప్, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News