Sunday, December 22, 2024

హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Four arrested for selling hash oil in Hyderabad
ముగ్గురు కస్టమర్లు పోలీసుల అదుపులో

హైదరాబాద్: హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురు నిందితులు, ముగ్గురు కస్టమర్లను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 480 గ్రాముల 66 బాటిళ్ల, రూ.1,90,000 విలువైన హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని ప్రకాశం జిల్లా, ఎర్రగొండ పాలెం మండలం, అయ్యంబొట్లపల్లి గ్రామానికి చెందిన ఎం. అశోక్ కుమార్ నిరుద్యోగి, నగరంలోని ఎస్‌ఆర్‌నగర్, బికె గూడలో ఉంటున్నాడు. ఖమ్మం జిల్లా, బరుహ్హన్‌పురానికి చెందిన సుమన్ వీర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, నేలకొండపల్లి మండలం, చెర్వు మాదవరం గ్రామానికి చెందిన భార్గవ్ నిరుద్యోగి, నగరంలోని మాసబ్‌ట్యాంక్ ఎండి ఇసాక్ అలీ వీడ్ ఆయిల్ విక్రయిస్తున్నాడు. హాష్ ఆయిల్ తీసుకుంటున్న ఎపిలోని గుంటూరు జిల్లా, అమరావతి రోడ్డు, పాండురంగ నగర్, సాయినవీన్ నగరంలోని ఎల్‌బి నగర్‌లో ఉంటున్నాడు, గుంటూరు జిల్లా, నకిరేకల్ మండలం, కొండలగొంట గ్రామానికి చెందిన బి. అశోక్ నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో ఉంటున్నాడు.

నగరంలోని గచ్చిబౌలికి చెందిన మీజాన్ అహ్మద్ రజ్వీ మార్కెటింగ్ చేస్తున్నాడు. ఎం. అశోక్ కుమార్ డిగ్రీ వరకు గుంటూరులో చదువుకున్నాడు, నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన శరత్ కొరివి ఇద్దరు స్నేహితులు. మాదపూర్‌కు చెందిన హరి విద్యార్థి అందరూ వ్యసనాలకు బానిసలుగా మారారు, మద్యం, సిగరేట్లు తాగడం చేస్తున్నారు. చాలామంది విశాఖపట్టనం, పాడేరు నుంచి నగరానికి చాలామంది వస్తున్నారని గమనించారు. వారి ద్వారా హాష్ ఆయిల్ తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకు వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ డబ్బులకు విక్రయించాలని ప్లాన్ వేశారు. ఇలా వీడ్ ఆయిల్ విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. పాడేరుకు చెందిన చిరు వద్ద శరత్ కొరివి, హరి హాష్ ఆయిల్ కొనుగోలు చేసి నగరంలోని అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు.

కొన్ని నెలల క్రితం శరంత్ కొరివి, ఎం. అశోక్ నగరానికి వచ్చి ఉంటున్నారు. ఇద్దరు కలిసి ఎస్‌ఆర్ నగర్‌లో ఉంటున్నారు. శరత్ తమతో కలవమని ఎం. అశోక్ కుమార్‌ను అడిగాడు. దానికి అంగీకరించిన అశోక్ కుమార్ వారితో కలిసి ఆష్ ఆయిల్ విక్రయిస్తున్నాడు. అశోక్‌కుమార్‌కు సుమన్ వీర్, భార్గవ్, ఎండి ఇసాక్ అలీ స్నేహితులు వారు కూడా కలిసి హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారు. వీరి వద్ద నుంచి సాయి నవీన్ అలియాస్ కన్నా, బి. అశోక్, మీజాన్ అహ్మద్ రవ్వ్‌జీ వీరి వద్ద తరచూ హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సైలు షేక్ కవియుద్దిన్, మల్లికార్జున్, ఎండి ముజఫర్ అలీ, రంజిత్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News