Sunday, January 19, 2025

గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Four arrested for selling marijuana in cyberabad
పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5.285 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సైబరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గంజాయి విక్రయిస్తున్న 18మందిపై పిడి యాక్ట్ పెట్టారు. గంజాయి విక్రయించే వారి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చెప్పాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర కోరారు. డయల్ 100, సైబరాబాద్ ఎన్‌డిపిఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ 7901105423 లేదా సైబరాబాద్ వాట్సాప్‌కి ఫోన్ చేయాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News