Thursday, December 19, 2024

పొగాకు వస్తువులు విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Four arrested for selling tobacco products
రూ.6,75,000 విలువైన వస్తువులు స్వాధీనం

హైదరాబాద్: నిషేధిత పొగాకు వస్తువులు విక్రయిస్తున్న నలుగురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.6,75,000 విలువైన వివిధ రకాల బ్రాండ్లకు చెందిన గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. రాజస్థాన్ రాష్ట్రం, పాలి జిల్లా, జైతరాం గ్రామానికి చెందిన కుమావత్ నతూరాం మాదాపూర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా, రామచంద్రాపురానికి చెందిన గండికోట వెంకటస్వామి నానక్‌రాంగూడలో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంఘారెడ్డి జిల్లా, పాట్‌పల్లెకు చెందిన మాలిపాటిల్ వెంకట్ రావు ఎంకే పాన్‌షాపు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన కుమావత్ నాతూరాం 15 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాబాద్‌కు వచ్చి మాదాపూర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన కుమావత్ నాతూరాం బేగంబజార్‌లోని పలువురు గుట్కా, పొగాకు వస్తువులు తక్కువ ధరకు సప్లయ్ చేసే వారితో పరిచయం పెంచుకున్నాడు. వారి వద్ద కొనుగోలు చేసి ఎక్కువ ధరకు హైదరాబాద్‌లోని పాన్‌షాపులు, జనరల్ స్టోర్స్‌కు సప్లయ్ చేస్తున్నాడు. ఇలా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎస్‌కె మసూద్‌ణు ఏజెంట్‌గా, వెంకటస్వామిని డ్రైవర్‌గా నియమించుకుని ఆటోలో సప్లయ్ చేస్తున్నాడు. ఎంకె పాన్‌షాపు యజమానికి గుట్కా సప్లయ్ చేసేందుకు తీసుకుని రాగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. గతంలో కూడా మాదాపూర్ పోలీసులు కుమావత్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, అనంత చారి, అరవింద్ గౌడ్,అశోక్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News