Wednesday, January 22, 2025

నకిలీ వీడియో కేసులో నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలోని బహదుర్‌పుర పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందని నకిలీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన నలుగురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మల్కాజ్‌గిరికి చెందిన ఊరుపల్లి శ్రావణ్, నాంపల్లికి చెందిన మహ్మద్ బిన్‌అలీ అల్ గుటామి, చాదర్‌ఘాట్‌కు చెందిన పిద్దమ్ముల కాశీ, చిక్కడపల్లికి చెందిన కనుకటి మితిలేష్ కలిసి పాతబస్తీలో రిగ్గింగ్ జరిగినట్లు వీడియోను వైరల్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 2022 ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌లో కొందురు చేసిన రిగ్గింగ్‌ను హైదరాబాద్ బహదుర్‌పురలో జరిగినట్లు నలుగురు ఆ వీడియోను వైరల్ చేశారు.

దీంతో ఒక్కసారిగా హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికలపై వివాదం నెల కొంది, కొందరు వెంటనే రిపోలింగ్ నిర్వహించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ట్విట్టర్, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం దానిపై విచారణకు ఆదేశించింది. దర్యాప్తు చేసిన పోలీసులు వేరే రాష్ట్రానికి సంబంధించిన వీడియోను వైరల్ చేశారని గుర్తించారు. వెంటనే వీడియోను వైరల్ చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై 66(డి) ఆఫ్ ఐటి యాక్ట్, 505(1)(సి), 171(ఎఫ్) ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో నలుగురిని జైలుకు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ మట్టం రాజు, ఎస్సై ప్రసేన్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News