Thursday, January 23, 2025

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఇంటర్ విద్యార్థి మృతికేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల కథనం ప్రకారం…ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి సాత్విక్ డ్రెస్‌ల మధ్య ఉన్న సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్‌ఛార్జి నరేష్‌ల వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సాత్విక్ పేర్కొన్నాడు. దీంతో నలుగురిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో శుక్రవారం హాజరపర్చారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News