Saturday, January 11, 2025

జూవెల్లరీ షాపు రాబరీ కేసులో నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

నలుగురిని మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
సిటీబ్యూరో: ఐటి అధికారుల పేరుతో బంగారు ఆభరణాల షాపులో దోపిడీకి పాల్పడిన ముఠాలోని నలుగురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సికిద్రాబాద్ మోండామార్కెట్‌లోని బంగారం దుకాణంలో ఐటి అధికారుల పేరు చెప్పి 1,700 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుల కోసం బయలు దేరిన ఐదు పోలీస్ బృందాలు మహారాష్ట్రలోని థానేలో జకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి సమాచారం రాబట్టి మిగతా వారి కోసం గాలిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని బాలాజీ జూవెల్లరీ షాపులో చోరీ చేసేందుకు మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది ముఠా నగరానికి వచ్చారు. నిందితులు వారం రోజుల నుంచి సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో మకాం వేసి రాబరీ కోసం ప్లాన్ వేశారు.

అనువైన సమయం చూసుకుని ఐటి అధికారులమని చెప్పి షాపులోకి ప్రవేశించారు. ట్యాక్స్ చెల్లించకుండా బంగారం విక్రయిస్తున్నారని చెప్పి బెదిరించారు, అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఒక చోటు కూర్చోబెట్టి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. షాపులో ఉన్న 1,7000 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. పట్టపగలు నగరం నడిబొడ్డున చోరీ జరగడంతో ఒక్కసారిగా పోలీసులు ఉల్కిపడ్డారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానించి సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఐదు పోలీస్ బృందాలను వీరిని పట్టుకునేందుకు ఏర్పాటు చేశారు. నిందితులు జెబిఎస్ నుంచి కూకట్‌పల్లి, పటాన్ చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను మహారాష్ట్రలోని థానేలో అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News