Monday, December 23, 2024

ఈ నాలుగు బ్యాంకుల్లో ఎఫ్‌డి రేట్లు పెరిగాయ్..

- Advertisement -
- Advertisement -

ముంబై : ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రెపో రేటులో ఎలాంటి మార్పు చేయనప్పటికీ నాలుగు బ్యాంకులు ఈ నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా టర్మ్ డిపాజిట్లపై వడ్డీని పెంచాయి. దీంతో సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు పెరగనుంది. అదే సమయంలో పెరుగుతున్న డిపాజిట్ మూలధనం కారణంగా బ్యాంకులు ఈ సంవత్సరం వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో నిపుణులు ఇప్పుడు అధిక వడ్డీ ప్రయోజనం కోసం పథకాలలో పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే నాలుగు బ్యాంకులు తమ ఎఫ్‌డి రేట్లను పెంచాయి.
యాక్సిస్ బ్యాంక్
ప్రైవేట్‌రంగ యాక్సిస్ బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీని పెంచింది. ఇది ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చిది. ఈ పెరుగుదల 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఖాతాదారులకు 3.5 శాతం నుంచి గరిష్ఠంగా 8.05 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
కెనరాబ్యాంక్
ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డి పథకాలపై 4 శాతం నుంచి 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు ఆగస్టు 12 నుండి అమలులోకి వచ్చాయి.
ఫెడరల్ బ్యాంక్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫెడరల్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 13 నెలల కాలానికి సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు 8.07 శాతంగా ఇస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆగస్టు ప్రారంభంలో 5 సంవత్సరాల కాలానికి తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 85 బేసిస్ పాయింట్లు (0.85 శాతం) పెంచింది. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 4.50 శాతం నుండి 9.10 శాతం వడ్డీ రేటుతో 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లను అనుమతిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News