- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా బుధవారం నలుగురు బిజెపి ఎంఎల్‌ఎలను గెంటివేయడమైంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల కొనుగోలులో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై చర్చించాలని బిజెపి ఎంఎల్‌ఎలు డిమాండ్ చేయడంతో దీనిపై గురువారం చర్చకు అనుమతిస్తానని స్పీకర్ రామ్‌నివాస్ గోయెల్ వివరించారు. అయితే బుధవారం నాడే చర్చించాలని బిజెపి ఎంఎల్‌ఎలు పట్టుపట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే బిజెపి ఎంఎల్‌ఎలు పట్టుపట్టడంతో స్పీకర్ వారిని బయటకు పంపించివేశారు.
- Advertisement -