Sunday, February 23, 2025

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట : మహారాష్ట్రలోని ఔరంగబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతులు గ్రామంలోని కృష్ణ, సంజీవ్, ఎరుకల సురేశ్, ఎరుకల శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. బతుకు దేరువు కోసం వెళ్లి సూరత్‌లో స్థిరపడ్డ నలుగురు అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్వగ్రామంలో తమ చిన్నాన్న అంత్యక్రియలకు వచ్చి కారులో సూరత్‌కు వెళ్తుండగా ఔరంగబాద్‌లో కారు పల్టీ కొట్టిన ఘటనలో నలుగురు అన్నదమ్ములు దుర్మణం పాలయ్యారు. మృతుల స్వగ్రామం చౌటపల్లిలోని వారి గృహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృత దేహాలను స్వగ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News