Friday, December 20, 2024

విద్యుత్‌షాక్‌తో నాలుగు గేదెలు, ఒక ఆవు మృతి

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్:  సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో విద్యుత్‌షాక్‌ తో నాలుగు గేదెలు, ఒక ఆవు మృతి చెందాయి. వివరాల ప్రకారం శనివారం ఉదయం 11గంటల సమయంలో లొద్ద బాలయ్య గేదెలను మేపడానికి పొలం వైపు తీసుకెళ్లారు. పొలంలో విద్యుత్ స్తంభాలకు మధ్య సుమారు 200 మీటర్ల దూరం ఉండడం వల్ల విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుంటే వాటికి కట్టె సపోర్టుగా పెట్టారు.

సపోర్టుగా ఉన్న కట్టె విరగడం వల్ల విద్యుత్ తీగలు గేదెలపై పడి నాలుగు గేదెలు, ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన గేదెలు చిన్నపట్ల శంకర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, బసిరెడ్డి రాంరెడ్డి, బసిరెడ్డి సాయిరెడ్డి లకు చెందినవి. మృతి చెందిన ఆవు దేవాలయంకు వదిలారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News