Wednesday, November 13, 2024

నగర శివారులో నాలుగు బస్‌స్టేషన్లు

- Advertisement -
- Advertisement -

పాత ప్రతిపాదనలను పరిశీలిస్తున్న
ఆర్‌టిసి అధికారులు

Four bus stations in suburbs

మనతెలంగాణ,సిటీబ్యూరో: ఆర్‌టిసి ఎండిగా సజ్జన్నార్ పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆర్‌టిసిలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. సంస్థకు సంబంధించిన సమస్య ఏదైనా అధికారులు వెంటనే స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటిలో భాగంగా ఇటు ప్రయాణికులు సౌకర్యం కోసమే కాకుండా సంస్థ అభివృద్దికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.

రవాణా వ్యవస్థ మెరుగు పడక పోతే వచ్చే సమస్యలపై సుమారు మూడు సంవత్సరాల క్రితం హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో టెక్నికల్ అడ్వైజరి కమిటీ సమావశం జరిగింది. ఇందులో హెచ్‌ఎండిఏ అధికారులతో పాటు ఆర్‌టిసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రజారవాణా వ్యస్థలో పెద్ద పాత్ర పోషిస్తున్న ఆర్టిసిపై చర్చి జరిగింది. నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, మనోహర్‌బాద్, పెద్ద అంబర్‌పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో సుమారు రూ.410 కోట్లతో ఎంజిబిఎస్ మాదిరిగా పెద్ద బస్టేషన్ల ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించారు.దాంతో ఆయా ప్రాంతాల్లో వీటిని బివోటి ప్రాతిపదికపై (నిర్మించు, నిర్వహించు ) బస్‌స్టేషన్లను హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో టెండర్లను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నాలుగు బస్టేషన్ల నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉండటమే కాకుండా నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గతుంది.

ఒక వైపు వీటిని అందుబాటులోకి తీసుకు వస్తూనే ఆయా బస్టేషన్లకు అనుసంధానంగా 15 ఇంటర్ననల్ బస్టేషన్స్(ఎమినిటీ సెంటర్స్) బేగం పేట, వైఎంసిఏ,తార్నాక, రాజేంద్రనగర్,ఫోర్ట్ రోడ్,షామీర్‌పేట,కీసర తారామతి, రావిరాల,తుక్కుగూడ,మామిడిపల్లి, బుద్వేల్ (ఐటీ పార్క్), టిఎస్‌పిఏ (తెలంగాణ పోలీస్ అకాడమీ),పటాన్ చెరు, దుండిగల్ ఏర్పాటు చేయాలని ఆర్టిసికి ప్రతి పాదనలు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హయత్‌నగర్,హకీంపేట,కాచిగూడ,కోఠీ,కూకట్‌పల్లి,రేతిఫిల్ ఆయా ప్రాంతాల ప్రయాణికులను అవసరాలను తీరుస్తున్నాయని, మరో 15 బస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే శివారు ప్రాంతాల్లో ఉండే ప్రయాణికుల అవసరాలను తీర్చడమే కాకుండ నగరంలో అస్థవ్యస్థంగా ఉన్న ట్రాఫిక్ వ్యస్థను నియంత్రణలోకి తీసుకు రావచ్చు.

ఈ 15 బస్టేషన్ల అందుబాటులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఉన్న టెర్మినల్స్ సంఖ్య 21కు పెరుగుతుంది. ఇప్పటికే ఆర్టిసి తనకు ఉన్న సుమారు 2800 బస్సులతో 29 డిపోల ద్వారా ప్రతి రోజు 25 లక్షల మంది ప్రయాణికులను గ్యమస్థానాలకు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శివారు ప్రాంతాల్లో నాలుగు పెద్ద బస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తే గ్రేటర్ ఆర్టిసికి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతిపాదిత బస్టేషన్లతో పాటు శ్రీశైలం రోడ్డు,కరీంనగర్ రోడ్డు, ముంబాయి రోడ్డు ప్రాంతాల్లో కూడా నిర్తిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమచారం. అయితే ఎండి సజ్జన్నార్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యల కారణంగా సంస్థ పునర్‌వైబోగం వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు గతంలో ప్రయాణికుల సౌకర్యం కోసమే కాకుండా సంస్థ అభివృద్దికి తయారు చేసిన ప్రతిపాదనలను తిరిగి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగి సంబంధిత ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే ఇటు సంస్థకు, అటు ప్రయాణికులకు మంచి రోజులు వచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News