Thursday, January 23, 2025

యాచారం చెరువులోకి దిగి నలుగురు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి: ఈతకు వెళ్లి నలుగురు బాలుర్లు చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండంలో గొల్లగూడ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రెహాన్(10), జబ్బు(11), ఇమ్రాన్(11), కాలేద్(10) తమ తల్లిదండ్రులతో కలిసి దర్గాకు వెళ్లారు. దర్గా నుంచి ఇంటికి వెళ్తుండగా గొల్లగూడ గ్రామ శివారులో ఓ ఎర్రకుంట చెరువు కనిపించింది. అందరూ అక్కడి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రుల కంటే ముందే రన్నింగ్ చేసి ఎర్రకుంట చెరువు వద్దకు చేరుకొని పిల్లలు నీళ్లలోకి దిగిపోయారు. వెళ్లిన పిల్లలు వెళ్లినట్టుగా మునిగిపోవడంతో అక్కడ ఉన్న కాపరి గమనించి నీళ్లలోకి దూకాడు. కొంచెం సేపు తరువాత నీళ్లలో నుంచి వారి మృతదేహాలను బయటకు తీశాడు. జెసిబితో మట్టిని తీయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పాడ్డాయని స్థానికులు వెల్లడించారు. గుంతలు తెలియక పోవడంతో ఈతరాని పిల్లలు అందులో మునిగి చనిపోయారు. దీంతో తల్లిదండ్రులు శోక్రసందంలో మునిగిపోయారు. కళ్ల ముందున్న కుమారులు చనిపోవడంతో తల్లిదండ్రుల రొదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News