Sunday, December 22, 2024

మరో ప్రాణాంతక వైరస్..నలుగురు చిన్నారుల బలి

- Advertisement -
- Advertisement -

గుజరాత్ లోని సబర్‌కాంతా జిల్లాలో ఇటీవల నలుగురు పిల్లలు జ్వరం, ప్లూ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరి, కొన్ని రోజుల్లోనే మృతి చెందారు. జులై 10న వారు చనిపోయారని వైద్యులు తెలిపారు. చాందీపుర వైరస్ వల్లనే వారు చనిపోయి ఉంటారని హిమ్మత్ నగర్ ఆస్పత్రి పీడియాట్రిక్ వైద్యులు భావిస్తున్నారు. మరో ఇద్దరు చిన్నారులు ఇవే లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం ఆరుగురు పిల్లల రక్త నమూనాలను సేకరించి , పూణే లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చాందీపుర వైరస్ మెదడువాపునకు కారణమవుతోంది. ఇది సోకిన కొన్ని రోజుల్లోనే రోగి మరణిస్తారు. దోమలు, పురుగుల ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది సోకిన వారిలో జ్వరం, ప్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాపించే ప్రాంతాల్లో పురుగులను చంపేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News