Saturday, April 26, 2025

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

జోగులాంబ,గద్వాల : గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కృష్ణానదిలో ఈతకు వెళ్లి నదిలో మునిగి సోమవారం మృతి చెందారు. మానవపాడు మండలం పల్లెపాడు గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి బురదలో ఇరుక్కుని మృతి చెందారని స్థానికులు తెలిపారు. నలుగురు చిన్నారులు ఒకేసారి మృత్యు వాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా మృతి చెందిన వారిని అఫ్రీన్(17), సమీర్ (8) నౌషిన్(7), రిహన్(15) గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News