Sunday, December 22, 2024

జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ హత్యకేసులో దోషులకు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ హత్య కేసులో దోషులైన నలుగురికి ఢిల్లీ కోర్టు శనివారం జీవితఖైదు విధించింది. అలాగే జరిమానా కూడా విధించింది. ఈ నేరం అరుదైన నేరాల కిందకు రాదని, అందుకే దోషలకు మరణ శిక్ష విధించలేదని తెలిపింది. మరో నిందితుడికి మూడేళ్లు జైలుశిక్ష ఖరారు చేసింది. హెడ్‌లైన్స్ టుడే న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేసిన 25 ఏళ్ల సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబరు 30 తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఆఫీస్ పని ముగించుకుని కారులో ఇంటికి వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దక్షిణ ఢిల్లీ లోని వసంత్ కుంజ్ ప్రాంతంలో కారులో ఆమె మరణించి ఉండటాన్ని పోలీస్‌లు గుర్తించారు. తొలుత ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించి ఉండొచ్చని పోలీస్‌లు అనుమానించారు.

అయితే పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఆమె తలకు బుల్లెట్ గాయమైనట్టు తేలడంతో హత్యగా నిర్ధారించారు. అనంతరం సిసిటివి దృశ్యాలను పరిశీలించగా, ఆమె కారును మరో వాహనం అనుసరించినట్టు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టి 2009లో రవికుమార్, అమిత్‌శుక్లాను ప్రశ్నించగా వారు సౌమ్యా విశ్వనాథన్‌ను కాల్చి చంపి దోచుకున్నట్టు చెప్పారు. మిగతా నిందితులైన బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌తోపాటు సహకరించిన అజయ్ సేథీని అరెస్టు చేశారు. 2010 జూన్‌లో ఈ కేసుపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ సాకేత్ కోర్టులో ఈ విచారణ సాగింది. ఈ ఏడాది అక్టోబరులో ఐదుగురు నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ ఐదుగురిలో రవికపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. హత్యకు సహకరించిన అజయ్ సేథీకి మూడేళ్లు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News