Monday, January 20, 2025

వారానికి 4 రోజులే పని

- Advertisement -
- Advertisement -

Four day work week india

జులై ఒకటి నుంచి కొత్త నిబంధనలు..!

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ చట్టాలకు సంబంధించి నిబంధనలను రూపొందించాయి. కొ న్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టా లు అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతనం, పిఎఫ్ కాం ట్రిబ్యూషన్, పని సమయం, వీక్లీ ఆఫ్‌లు వంటి వా టిలో పలు మార్పులు చేసుకోనున్నాయి. కొత్త చ ట్టాల ప్రకారం.. రోజువారీ పని సమయం 12 గం టలకు పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది గం టలకు బదులు 12 గంటల పాటు పనిచేయాలని కంపెనీ ఉద్యోగులను కోరవచ్చు. ఈ లెక్కన వారం లో మూడు వీక్లీ ఆఫ్‌లు వస్తాయి. వారానికి గరిష్ఠం గా 48 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. ఒకవేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పని చేయించుకుంటే వారంలో ఒక వీక్లీ ఆఫ్ మాత్రమే వస్తుంది. కొత్త కార్మిక చట్టా ల ప్రకారం.. మొత్తం వేతనంలో బేసిక్ వేతనంలో సగం ఉండాలి. అంటే అలవెన్సులు 50శాతానికి మించి ఉండకూడదు. ఈ లెక్కన బేసిక్ పెరిగినప్పు డు ఆ మేర పిఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం పెరుగుతుంది. దీనివల్ల చేతికొచ్చే వేతనం తగ్గుతుంది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే మొత్తంతో పాటు, గ్రా ట్యూటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారి వేతనంలో ఎక్కువ శాతం అలవెన్సులే ఉంటాయి. కొత్త చట్టాలు అమలైతే ఆ మేరకు చేతికొచ్చే వేతనం తగ్గుతుంది.

సెలవుల్లోనూ మార్పు..
ఉద్యోగికి ఏడాదిలో ఇచ్చే సెలవుల్లో ఎలాంటి మార్పూ ఉండబోదు. అలాగే, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు 180 రోజులు దాటిన తర్వాత లీవులు పొందొచ్చు. ప్రస్తుతం 240 రోజులు దాటాకే సెలవులు వస్తున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ చట్టాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే కొత్త కార్మిక చట్టాలకు సంబంధించి నియమ, నిబంధనలను రూపొందించాయి. ఈ చట్టాలను పార్లమెంట్ ఆమోదించినప్పటికీ ఉమ్మడి జాబితాలో ఉండడంతో ఆయా రాష్ట్రాలు కూడా వీటిని నోటిఫై చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News