Sunday, December 22, 2024

వరంగల్ ఎంజిఎంలో దారుణం

- Advertisement -
- Advertisement -

వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో కుక్కల బెడద రోజురోజుకీ పెరిగిపోతోంది. వీ ధికుక్కలు చిన్నారుల పాలిట మృత్యుదేవతలుగా మారుతున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి సమయంలో వరంగ ల్ ఎంజిఎం ఆసుపత్రి అత్యవసర విభాగం ఆవరణలో నాలుగు రోజుల పసికందును వీధికుక్కలు గుంపుగా పట్టుకొని లాక్కుంటూ దాడి చేసి చెవులు, తల భాగంలో కర్కశంగా కొరుకుతుంటే ఆస్పత్రి సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేషన్ కానిస్టేబుల్ చూసి పసికందును కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే పసికందు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పసికందు మృతి చెందిన ఘటన ఆస్పత్రిలోని స్థానికులు అందరి మనసులను కలచివేసింది.

మృతి చెందిన పసికందును కుక్కలు లాక్కొచ్చాయా? మృతి చెందిన శిశువు ఆడనా, మగనా.. అనేది తెలియరావడం లేదు. పసికందును సగం తినడంతో గుర్తుపట్టడం కష్టంగా ఉంది. ప్రాణంతోనే ఉన్న పసికందుపై దాడి చేసి చంపేశాయా..! పసికందు తల్లిదండ్రులు ఎవరు? ఈ శిశువును ఎక్కడి నుండి తీసుకొచ్చాయి.. అనే కోణంలో వైద్యులు, పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ అనంతరం పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మృతి చెందిన పసికందును ఎంజిఎం మార్చురీలో భద్రపరిచారు.

పిల్లల విభాగం ముందు కుక్కల స్వైరవిహారం
వరంగల్ ఎంజిఎం పిల్లల విభాగం ముందు ఆవరణలో రాత్రి వేళల్లో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతూ పిల్లల అత్యవసర విభాగం మొదటి అంతస్తు మెట్లపై నిద్రిస్తున్నట్లు రోగి అటెండర్లు చెబుతున్నారు. గతంలో పిల్లల విభాగం ఆవరణ ముందు రాత్రి వేళలో కుక్కల దాడిలో ఓ మహిళ నేలపై పడిపోయింది. అక్కడున్న సెక్యూరిటీ గమనించి ఆ మహిళకు కుక్క కాటు నుండి తప్పించి కాపాడారని ఆస్పత్రి సిబ్బంది అన్నారు. రాత్రివేళ ఎంజిఎం అత్యవసర విభాగంలోని కొన్ని వార్డులలో కుక్కలు తిరుగుతున్నట్లు పలువురు రోగులు చెబుతున్నారు. ఎంజిఎం ఆస్పత్రి ఆవరణలో కుక్కల బెడదను నివారించేందుకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని, ఆస్పత్రి సెక్యూరిటీ అప్రమత్తంగా ఉండాలని పలువురు రోగులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News