రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వాన
హైదరాబాద్: అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో భారీగా వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసి ముద్దవ్వగా, రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్‌లో భారీ వర్షం కురిసింది.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా…
గురువారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 72 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 51, పెద్దపల్లిలో 48, జయశంకర్ భూపాలపల్లిలో 35, జగిత్యాలలో 29, నల్లగొండలో 29, రంగారెడ్డిలో 25, వరంగల్‌లో 21, సంగారెడ్డిలో 19, భద్రాద్రి కొత్తగూడెంలో 18, హైదరాబాద్‌లో 16, మేడ్చల్ మల్కాజిగిరిలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యినట్టు వాతావరణ శాఖ తెలిపింది.