Monday, December 23, 2024

విహార యాత్రలో విషాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జగద్గిరిగుట్ట: హైదరాబాద్ నుండి బాపట్లకు సెలవుల్లో విహార యాత్రకి వెళ్లిన నలుగురు స్నానం కోసం కాలువలో దిగి గల్లంతు అయ్యారు. వారి లో తండ్రి, కొ డుకు ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి కో సం నీటిలో బాపట్ల పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు  బాపట్ల పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టకు చెందిన మెడికల్ రిపర్సెంటేటివ్‌గా పనిచేస్తున్న సునీల్ కుమార్ (35), అనూప్ రాజ్ (13) ఏడవ తరగతి తండ్రీకొడుకులు. ఇటీవల వీరు ఈసిఐఎల్‌కు చెందిన మరో ఇద్దరిరు కిరణ్ కుమార్ (30), జగద్గిరిగుట్టకు చెందిన బండ నందు (35) కుటుంబాలతో కలిసి వారి సొంత ఊరుకు వెళ్లారు.

అక్కడ సరదాగా ఈత కోసం బాపట్లలో సూర్య లంకలో స్నానం కోసం వెళ్లారు. అక్కడ ప్రమాదవా శాత్తు వీరు నలుగురు నీటిలో గల్లంతయ్యారు. కొంతసేపటి తరువాత విషయం గమనించిన స్థానికులు వారిని పోలీసుల సహాయంతో వెలికి తీసే ప్రయత్నం చేయగా తండ్రి సునీల్, కుమారుడు అనూప్ మృతదేహాలను వెలికి తీశారు. మిగతా ఇద్దరి కోసం నీటిలో గాలింపు చేపడుతున్నట్లు వారి బంధువులు తెలిపారు. నీటిలో నగర వాసులు గల్లంతు అయ్యారనే విషయం తెలుసుకున్న జగద్గిరిగుట్ట స్థానికులు ఫోన్‌లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనతో జగద్గిరిగుట్టలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News