Thursday, January 23, 2025

సముద్రతీరంలో ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు… మరో నాలుగు మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

Four dead bodies found in pudimadaka sea shore

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది.  అచ్యుతాపురం మండలం పుడిమడక సముద్ర తీరంలో అనకాపల్లి దాడి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం గల్లంతయ్యారు. నిన్ననే పవన్ కుమార్ మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి తేజును స్థానిక మత్య్సకారులు రక్షించి గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  గల్లంతైన ఐదుగురు విద్యార్థుల జాడ కోసం శనివారం ఉదయం నుంచి హెలికాప్టర్లు, తీరపు రక్షక దళాలకు చెందిన పడవలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కొద్ది సేపటి క్రితం రెస్క్యూ టీమ్ నాలుగు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మృతులు నర్సిపట్నానికి చెందిన జశ్వంత్ కుమార్, చుచుకొండకు చెందిన పెంటకోట గణేష్, కంపర జగదీష్, బయ్యపునేని సతీష్ కుమార్ గా గుర్తించారు. పూడి రామచందు జాడ కోసం సముద్రంలో రెస్క్యూ టీమ్ జల్లెడ పడుతుంది.  బాధితుల కుటుంబ సభ్యుల రోదనలతో పుడిమడక సముద్ర తీరంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News