Monday, January 20, 2025

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి..నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ ( ఉక్రెయిన్) : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వస్థలమైన సెంట్రల్ ఉక్రెయిన్ నగరం క్రీవ్ రిహ్ పై సోమవారం రష్యా క్షిపణులు దాడులు చేశాయి. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్, యూనివర్శిటీ భవనాలపై క్షిపణులు దూసుకువెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్లకు శిధిలాల కింద అనేక మంది చిక్కుకు పోయారని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి క్లెమింకో వెల్లడించారు. రెండు క్షిపణులు దూసుకువెళ్లడంతో అపార్ట్‌మెంట్ లోని నాలుగు, తొమ్మిది అంతస్థుల మధ్య భవనం దెబ్బతిందని చెప్పారు. నల్లని పొగ కమ్ముకోవడం, వీధిలో కార్లు దగ్ధం అవుతుండడం వీడియోలో కనిపిస్తోంది. మృతుల్లో పదేళ్ల బాలిక కూడా ఉంది.

ఈ దాడిలో 53 మంది గాయపడ్డారని నాలుగు అంతస్థుల యూనివర్శిటీ భవనం కొంతభాగం ధ్వంసం అయిందని క్లెమింకో తెలిపారు. అయితే రష్యా పాక్షికంగా ఆక్రమించిన డొనెట్‌స్క్ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్ సాయుధ దాడికి ఇద్దరు మృతి చెందారని, ఆరుగురు గాయపడ్డారని మాస్కో నియమిత నేత డెనిస్ పుషిలిన్ వెల్లడించారు. డొనెట్‌స్క్‌పై సోమవారం అనేకసార్లు ఉక్రెయిన్ దాడులు చేయడంతో బస్సు కూడా ధ్వంసమైందని తెలిపారు. రష్యాపై ఉక్రెయిన్ ఆదివారం జరిపిన దాడుల్లో క్రిమియాలో రెండు కార్యాలయ భవనాలు ధ్వంసం అయ్యాయి. ఆ దాడి తరువాత రష్యా భద్రతను మరింత కట్టుదిట్టం చేసిందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ సోమవారం వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News