గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహెజ్‌లో ఒక రసాయన కర్మాగారంలో గ్యాస్ లీక్‌తో వెలువడిన విష వాయువులు పీల్చిన నలుగురు కార్మికులు మరణించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఆ నలుగురికీ వెంటనే వైద్య చికిత్స అందించినట్లు, కానీ వారి ప్రాణాలు కాపాడలేకపోయినట్లు సంస్థ తెలిపింది. ప్రతి మృతుని సమీప బంధువుకు రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియాను సంస్థ ప్రకటించింది. గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ లిమిటెడ్ (జిఎఫ్‌ఎల్) ఉత్పత్తి యూనిట్‌లో శనివారం రాత్రి ఒక పైపు
నుంచి విష వాయువులు వెలువడిన తరువాత ఒక సంస్థ ఉద్యోగి, ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు స్పృహ కోల్పోయారని, వారిని హుటాహుటిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఆ నలుగురూ మరణించారని దహెజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బిఎం పాటిదార్ తెలియజేశారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపినట్లు, ఘటనపై దర్యాప్తు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. మృతుల్లో ఒకరు భరూచ్ వాసి కాగా, ఒకరు ఝార్ఖండ్‌లోని అధౌరాకు, మరి ఇద్దరు ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందినవారు.