కొండపోచమ్మ జలాశయంలో హవేలీ ఘనపూర్ చెరువులో మరి ఇద్దరు
మన తెలంగాణ/ములుగు/మెదక్ ప్రతినిధి: విహారయాత్ర నాలుగు కు టుంబాల్లో విషాదం నింపింది. ఉ మ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో నీటి మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ మం డల గిద్దకుంట చెరువులో స్నానానికి దిగి ఇద్దరు.. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ జలాశయంలో గల్లంతై మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇందుకు సం బంధించి వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ఈతకు వెళ్లి హైదరాబాద్ బాచుపల్లికి చెందిన అక్షయ్ వెంకట్(28), బోయినపల్లికి చెందిన రాజన్ శర్మ(28) మృతి చెందారు. రామ్‌కోటి ప్రాంతానికి చెందిన మరో స్నేహితుడు రుశాబ్ షాతో కలిసి ఆదివారం ఉదయం కొండపోచమ్మ జలాశయానికి విహారయాత్ర నిమిత్తం కారులో కలిసి వచ్చారు.
అక్షయ్ వెంకట్, రాజన్ శర్మ స్నానానికి దిగి ఈత కొట్టే ప్రయత్నంలో నీట మునిగి గల్లంతయ్యారు. కా గా, మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో ఎల్లమ్మ పండు గ కోసం వచ్చి.. సమీపంలోని గిద్దకుంట చెరువులో సరదాగా స్నానానికి వెళ్లి ఎరుకల లక్ష్మణ్(18), గం గారామ్ (34) మృతిచెందారు. బంధువుల ఇంటికి వచ్చిన మరో 15మంది యువకులతో కలిసి చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. కాగా, స్నానం చేసే క్రమంలో లోతు తెలియక పూడికతీసిన గుంతలో పడి వీరిద్దరూ మృతి చెందారు. స్నేహితులు వారిని కాపాడే ప్రయత్నంచేసినా ఫలితం లేకపోయింది. ఈ రెండు ఘటనల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.