Saturday, December 21, 2024

జల విషాదాలు

- Advertisement -
- Advertisement -

Four died in water accidents

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
ఎస్‌ఆర్‌ఎసి కాలువలో ఇద్దరు బాలికలు, గడ్డెన్నవాగులో ఇద్దరు యువకులు

మన రాష్ట్రంలో సోమవారం నాడు వేర్వే రు ప్రాంతాల్లో జరిగిన జల ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత ప డ్డారు. ఈక్రమంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలో ఇద్దరు బాలికలు మృతి చెందగా, గడ్డెన్నవాగులో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృ తి చెందారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం దుబ్బతండాకు చెందిన ర మ్యశ్రీ, పాటు మరో ఇద్దరు బాలికలు ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో మునిగి రమ్యశ్రీ (8), వసంతి మృతి చెం దగా మరో ఇద్దరిని స్థానికులు ర క్షించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరు గా విలపించారు. ప్రమాద విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కే సు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే ని ర్మల్ జిల్లాలోని బైంసా పట్టణంలోని కుంటగల్లీకి చెంది న సోయల్, పాటు మరో ఆరుగురు గడ్డెన్న వాగు ప్రాజెక్టులో స్నానానికి వెళ్లారు.

ప్రాజెక్టు వద్ద తిరుగుతుండగా చేపలు పడుతున్న జాలర్ల వద్దకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సయ్యద్ సోహైల్ అనే యువకుడు బండ రాయిపై పెట్టిన కాలు జారిపోవడంతో ప్రాజెక్టు నీటిలో పడి మునిగిపోయాడు. దీంతో అతని వెనుకే ఉన్న సయ్యద్ ఫిరోజ్ మిత్రుడిని రక్షించేందుకు ప్రయత్నించాడు. ఒకరిని రక్షించబోయి మరొకరు ఈ క్రమంలోనే ఫిరోజ్ కూడా అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. ఇద్దరు మిత్రులు కళ్లముందే నీటిలో మునిగిపోతుంటే మిగిలిన నలుగురు కాపాడేందుకు విఫలయత్నం చేశారు. రక్షించండి అంటూ వారు కేకలు వేయగా స్థానిక జాలర్లు, ఇతరులు వచ్చి యువకులను రక్షించేందుకు యత్నించారు. అప్పటికే సొయల్ (20) ఫెరోజ్ (20)లు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భైంసా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News