Sunday, December 29, 2024

రోడ్డు ప్రమాదంలో నలుగురు డాక్టర్లు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ లో తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు డాక్టర్లు మృతి చెందారు. వీరితోపాటు ఓ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరంతా సైఫాయిలో ఉన్న యూపీ మెడికల్ యూనివర్శిటీ డాక్టర్లని పోలీస్‌లు తెలిపారు. అతివేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తరువాత అటువైపు వస్తున్న ఓ ట్రక్కు ఆ వాహనాన్ని ఢీకొట్టినట్టు ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. మృతుల్లో డాక్టర్లు అనిరుధ్ వర్మ, సంతోష్‌కుమార్ మౌర్య, అరుణ్‌కుమార్, నర్‌దేవ్ ఉన్నారు. ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News