Monday, December 23, 2024

హోలీ వేడుకల్లో విషాదం… నదిలో మునిగి నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారే…
సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

మనతెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి (కౌటాల): హోలీ పండుగ వేళ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో స్నానానికి అని వార్దానదిలో మునిగి నలుగురు మృతి చెందిన సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో చోటు చేసుకుంది. నదిమాబాద్ గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు సోమవారం ఉదయం హోళి పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగు చల్లుకుంటు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మధ్నాహ్నం స్నానం చేయడానికని వార్దా నదిలోకి వెళ్లి స్నానం చేశారు. ఇందులో ఇద్దరు స్నేహితులు స్నానం చేసి వార్దా నది ఒడ్డుపైకి వచ్చారు. మిగితా నలుగురు స్నేహితులు నదిలో స్నానం చేస్తూ లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లారు.

దీంతో నది ఒడ్డున ఉన్న ఇద్దరు స్నేహితులు వెంటనే సమీపంలోని గ్రామానికి వెల్లి గ్రామస్తులకు తెలియజేయడంతో వారు నది వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే స్థానిక పోలీసులు గజ ఈతగాళ్లను తెప్పించి నదిలో గాలిస్తుండగా అల్లం సాయి (22), ఉప్పల సంతోష్ (24), ప్రవీణ్ (24), కమలాకర్ (24) అనే నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వెంటనే మృతదేహాలను నది ఒడ్డుపైకి తీసుకువచ్చారు. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. వెంటనే జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్, డిఎస్‌పి కరుణాకర్, సంఘటన స్థలానికి చేరుకోని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సాదిక్‌పాషా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News