Thursday, December 19, 2024

గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గంజాయి తరలిస్తున్న నలుగురు ముఠాను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 31.34కిలోల గంజాయి, కారు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌ఈస్ట్‌జోన్ ఎడిసిపి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, వట్టేపల్లికి చెందిన షేక్ అబ్దుల్ ఫైసల్, మహ్మద్ సమీ ఉద్దిన్ అలియాస్ అబ్బు, ఎండి అమీర్, హుస్నా ఫాతిమా అలియాస్ సాజీదా తబూస్సాం కలిసి గంజాయిని రవాణా చేస్తున్నారు. షేక్‌అబ్దుల్ మిగతా వారు స్నేహితులు, ఒడిశా రాష్ట్రానికి చెందిన రితేష్ వీరికి గంజాయి సరఫరా చేస్తున్నాడు.

షేక్ అబ్దుల్ ఫైసల్, ఎండి సమీ కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఎపిలోని అరకులో గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే కంచన్‌బాగ్ పోలీసులకు సమాచారం రావడంతో పట్టుకున్నారు. తన స్నేహితులకు ట్రిప్పుకు రూ.10,000 ఇస్తామని చెప్పడంతో వారు కారు తీసుకుని ఒడిసాకు వెళ్లారు. వారు 15 ప్యాకెట్లలో తీసుకుని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ శేఖర్‌రెడ్డి, ఎస్సైలు అనంత చారి, రాఘవేంద్రరెడ్డి, సాయిరామ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News