Sunday, January 19, 2025

డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్ననలుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను ఎల్‌బి నగర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నింతులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 15గ్రాముల ఎండిఎంఏ, 2కిలోల గంజాయి, రూ.4,040 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి డిఎస్ చౌహాన్ వివరించారు. రంగారెడ్డి జిల్లా, యాదవ్ నగర్‌కు చెందిన జక్కా సునీల్ వ్యాపారం చేస్తున్నాడు. ఎండి ఆరిఫ్ ఖాన్, ఎండి జబార్ ఖాద్రి, మీర్జా ఇస్మాయిల్ ఆలీబైగ్, షేక్ నోమన్, సత్రూ కలిసి గంజాయి,డ్రగ్స్ విక్రయిస్తున్నారు. షేక్ నోమన్, సత్రూ పరారీలో ఉండగా మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు.

సునీల్ తరచూ వైజాగ్‌కు వెళ్లి అక్కడ గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు. సునీల్, షేక్‌నోమన్ స్నేహితులు, సునీల్ వద్ద నోమన్ గంజాయి రెండు నుంచి నాలుగు వేలకు కొనుగోలు చేసి దానిని చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి రూ.15 నుంచి రూ.20వేలు సంపాదిస్తున్నాడు.వైజాగ్‌లోని సత్రూ వద్ద గంజాయి, ఎండిఎంను కొనుగోలు చేసిన సునీల్ వాటిని విక్రయించేందుకు ఎండి ఆరీఫ్, ఎండి జాబేర్ ఖాద్రీని కలిశాడు. ఈ క్రమంలోనే పోలీసులకు విషయం తెలిసి దాడి చేసి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్, అంజిరెడ్డి, ఎస్సై ప్రతాప్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News