Thursday, January 23, 2025

ఈ ఏడాది నాలుగు గ్రహణాలు.. ఏ ఒక్కటీ భారత్‌లో కనిపించదు

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : 2024 సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. కానీ వీటిలో ఏ ఒక్కటినీ మనదేశంలో చూసేవీలు కలుగదని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ నగరంలో ఉన్న జివాజీ అబ్జర్వేటరీ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ గ్రహణాల పరంపర మార్చి 25న పెనుంబ్రల్ చంద్ర గ్రహణంతో ప్రారంభమౌతుందని అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాష్ గుప్త వివరించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు పెనుంబ్రల్ గ్రహణం ఏర్పడుతుంది. ఇది మొదటి గ్రహణమే అయినప్పటికీ భారత్‌లో సందర్శించే అవకాశం కలగదు. ఎందుకంటే ఆ సమయంలో భారత్ లో పగటి పూట వస్తుంది. ఏప్రిల్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయినా దీన్ని కూడా భారత్‌లో చూడలేం. ఎందుకంటే ఏప్రిల్8,9 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో ఏర్పడడమే దీనికి కారణం.

సెప్టెంబర్ 18 ఉదయాన పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఉదయం కావడం వల్ల దీన్ని భారత్‌లో చూడలేం. ఇక అక్టోబర్ 2,3 తేదీల అర్ధరాత్రి సమయంలో కంకణాకారంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ భారత్‌లో అర్ధరాత్రి వేళ కావడంతో ఆ అపురూప గ్రహణాన్ని సందర్శించే అవకాశం కోల్పోవడమౌతుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కంకణాకార సూర్యగ్రహణం 7 నిమిషాల 21 సెకండ్లపాటు ఉంటుంది. సూర్యగోళంలో 93 శాతం గ్రహణం పట్టడం వల్ల చేతి కంకణం వలె సూర్యుడు కనిపిసాడని డాక్టర్ గుప్తా చెప్పారు. గత ఏడాది (2023)అద్భుతమైన ఖగోళ సంఘటనలకు సాక్షంగా నిలిచింది. నాలుగు గ్రహణాలు సంభవించగా వాటిలో ఒకటి సంపూర్ణ సూర్యగ్రహణం , పెనుంబ్రల్ చంద్ర గ్రహణం , కంకణ సూర్యగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం దర్శనమిచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News