Saturday, December 28, 2024

2025 లో నాలుగు గ్రహణాలు

- Advertisement -
- Advertisement -

2025 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. అందులో రెండు చంద్ర గ్రహణాలు కాగా, రెండు సూర్యగ్రహణాలు. వీటిలో ఒకటి మాత్రమే భారత్‌లో కనిపించనున్నట్టు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాశ్ గుప్తా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. అయితే అది పగటిపూట ఏర్పడడం వల్ల మనదేశంలో కనిపించే అవకాశం లేదన్నారు.

అమెరికా, పశ్చిమ, ఐరోపా, పశ్చిమాఫ్రికా, ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రాల వద్ద ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందన్నారు. మార్చి 29న పాక్షిక సూర్య గ్రహణం వస్తుందని,దాని ప్రభావం భారత్‌లో ఉండబోదని తెలిపారు. సెప్టెంబర్ 7,8 తేదీల్లో ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహనాన్ని భారత ప్రజలు వీక్షించే అవకాశం ఉందన్నారు. 2025 ఏడాదిలో చివరి గ్రహణం సెప్టెంబరు 2122 మధ్య సంభవిస్తుందని , ఈ పాక్షిక సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదని గుప్తా వెల్లడించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News