Monday, December 23, 2024

యుపిలో కీలక పరీక్షకు లీక్

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో మరో అత్యంత కీలకమైన పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఫిబ్రవరి 11న జరిగిన రివ్యూ ఆఫీసరు/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసరు పోస్టులకు జరిగిన అర్హత పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయినట్లు గుర్తించంతో ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ముందుగా అధికారులు ప్రశ్నాపత్రాల లీక్ జరగలేదని బుకాయించారు. గజియాబాద్ జిల్లా కలెక్టర్ అర్యక అఖౌరీ దీనిపై గట్టిగా స్పందిస్తూ పేపర్ లీక్ వార్తలను తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. అయితే నాలుగు నెలల తరువాత ఆమె వాదన తప్పని తేలింది. అయితే దీనిపై జరిగిన దర్యాప్తు క్రమంలో భోపాల్‌లో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నాపత్రాల పబ్లిషింగ్ దశలోనే ఇది లీక్ అయినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్థారించింది.

దీనికి బాధ్యులుగా నలుగురు ఇంజనీర్లు రాజీవ్ నయన్ మిశ్రా, సునీల్ రాఘవంశీ, విషాల్ దూబే, సుభాష్ ప్రకాశ్ అని తేల్చారు. తరువాత పరీక్షకు కొద్ది గంటల ముందు రెండోసారి లీక్ జరిగింది. తెల్లవారుజామునే ఈ ప్రశ్నాపత్రాలను వాటి పర్యవేక్షకుడు అర్పిత్ వినీత్ యశ్వంత్ తన సెల్‌కెమెరాతో క్లిక్ మన్పించి బయటకు పంపించారు. ఈ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రం ప్రింటింగ్ దశలోనే ఇంజనీర్లు వీటిని కొనుగోలు చేయడానికి వచ్చిన వారికి తలో రూ పది లక్షలు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ప్రశ్నలను వారికి ముందుగా చదివి విన్పించడం చేశారని వెల్లడైంది. ఇన్ని అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఈ పరీక్షను రద్దు చేసేశారు. కానీ నిజాలను మరింతగా దర్యాప్తు చేసేందుకు విచారణ వేగవంతం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News