Friday, December 20, 2024

జనగామలో నలుగురు నకిలీ పోలీసుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్లకు చెందిన నలుగురు వ్యక్తులు తాము పోలీసులము అని చెప్పి బాధితుల వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. నకిలీ పోలీసులు భువనగిరికి చెందిన వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఓ పౌల్ట్రీ వ్యాపారి నుంచి రూ.30 వేలు తీసుకున్నారు. మరికొందరి దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి రూ.30 వేలు, బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News