Thursday, December 26, 2024

నిజామాబాద్‌లో కుటుంబం బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

Four family dead in hotel in Nizamabad

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. సూర్యప్రకాశ్ అనే వ్యక్తి తన మొదటి భార్య, పిల్లలకు పురుగులమందు తాగించాడు. అనంతరం ఉరేసుకుని సూర్యప్రకాశ్ కూడా ప్రాణాలు తీసుకున్నాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సూర్యప్రకాశ్ హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత 15 రోజులుగా సూర్యప్రకాశ్ కుటుంబం హోటల్ లోనే బస చేస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News