Monday, November 18, 2024

విద్యుత్‌షాక్‌తో నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Four fatalities with Electric shock

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల దుర్ఘటనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం నాడు చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులలో దంపతులతో పాటు ఒక రైతు, కూలీ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని జీకేపేట పంచాయతీలోని సింగారం -2 కాలనీకి చెందిన ఆనపర్తి తిరుపతమ్మ(28) స్నానానికి వెళ్లొచ్చి తువ్వాలును ఇనుపతీగపై ఆరేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ దండేనికి విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్ కొట్టి ఆమె కేకలు వేశారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో భర్త ఉపేందర్(32) కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలున్నారు.

అలాగే మోటారు బంద్ చేద్దామని వెళ్లి మహబూబాబాద్ మండలం సింగారం శివారు ఇస్లావత్ తండా చెందిన ధరావత్ హరిసింగ్(32) చెరువు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలి మృతిచెందారు. వ్యవసాయ బావి మోటారును బంద్ చేసేందుకు వెళ్లి ఆయన ప్రమాదానికి గురయ్యారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్‌లో సుమ(36) అనే మహిళా కూలీ శుక్రవారం రోజున విద్యుదాఘాతంతో మరణించారు. కార్తికపౌర్ణమి పర్వదినం కావడం వల్ల ఇంటిని శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ హీటర్‌కు తాకి మృత్యువాత పడింది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News