Saturday, December 21, 2024

నలుగురు యువతులు ఆత్మహత్యాయత్నం… అక్కాచెల్లెళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: నలుగురు యువతులను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కాచెల్లెళ్లు చనిపోయిన సంఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతులు నలుగురు స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగామని తన స్నేహితురాళ్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇద్దరు యువతులు అక్కడికి చేరుకొని విషం తాగారు. వెంటనే స్థానికులు నలుగురిని ఔరంగాబాద్‌లోని సదార్ మెగద్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ అక్కడే చనిపోయారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వాళ్ల నుంచి ఇంకా సమాచారం తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News