Monday, December 23, 2024

ఐఎం ఉగ్రవాదులు నలుగురికి పదేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2012 లో దేశంలో ఉగ్రదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై ఇండియన్ ముజాహిదీన్ ( ఐఎం ) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురికి ఢిల్లీ కోర్టు బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. నేరస్థులు డానిష్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం, ఇమ్రాన్‌ఖాన్ , ఒబయిద్ యుర్ రెహ్మాన్ లకు స్పెషల్ జడ్జి శైలేందర్ మాలిక్ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. జులై 7న నేరస్తులు తమ నేరాన్ని అంగీకరించగా, స్పెషల్ కోర్టు జులై 10న శిక్ష విధిస్తూ తీర్పు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News