Monday, January 20, 2025

ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయులు మృతి

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. విక్టోరియా రాష్ట్రం ఫిలిప్ ఐలాండ్‌లోని బీచ్ లో మునిగి మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు భారతీయ మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతులలో ఇద్దరు మహిళ వయసు 20 ఏళ్లు, మరో వ్యక్తి వయసు 40 ఏళ్లు ఉంటాయని వెల్లడించారు. మరో 20 ఏళ్ల మహిళను కాపాడి మెల్‌బోర్న్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపు ఆమె చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఈ
సంవత్సరం గజ ఈతగాళ్లు 600 మందిని రక్షించారని, వేసవి కాలంలో 19 మంది మృతి చెందారని స్థానిక అధికారులు వెల్లడించారు. మెల్‌బోర్న్‌లో ఉన్న భారత్ ఎంబసీ అధికారులు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News