Monday, January 20, 2025

ఆస్ట్రేలియాలో నీట మునిగి నలుగురు భారతీయుల మృతి

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయులు బుధవారం మధ్యాహ్నం బీచ్‌లో నీట మునిగి మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రం లోని ఫిలిప్ ఐలాండ్‌కు చెందిన బీచ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గత ఇరవై ఏళ్లలో ఈ ప్రాంతంలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

బీచ్‌లో వారు నీట మునిగి పోవడాన్ని గమనించిన సిబ్బంది కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అక్కడే ముగ్గురు మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందినవారుగా తెలుస్తోంది. కాన్‌బెర్రా లోని భారత్ హైకమిషన్ ఈ విషాద సంఘటనకు తీవ్ర సంతాపం తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News