Saturday, November 23, 2024

నేపాల్ రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయుల మృతి

- Advertisement -
- Advertisement -

Four Indians killed in Nepal road accident

ఖాట్మాండు : నేపాల్ భారత్ సరిహద్దు సమీపం లోని రౌతత్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా దూసుకుపోయి అదుపు తప్పడంతో 20 మీటర్ల లోతున్న చెరువులో మునిగిపోయింది. అందులో చిక్కుకున్న ఈ నలుగురు బయటకు రాలేక ఊపిరాడక మృతి చెందినట్టు సమాచారం. డ్రైవర్‌తోపాటు ప్రయాణిస్తున్న నలుగురూ మద్యం సేవించి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మృతులు దినానాధ్ సాహ్ (25).అరుణ్ సాహ్ (30), దిలీప్ మహతో (28).అమిత్ మహతో (27) బీహార్‌కు చెందిన వారు. రౌతత్ పోలీసుల కథనం ప్రకారం శనివారం రాత్రి ఝుంఖున్వా చౌక్ వద్ద నుంచి చంద్ర నిఘహపూర్ నుంచి గౌర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రౌతత్ పోలీసులు భారత పోలీసులకు మృతుల ఫోటోలు పంపడంతో మృతుల కుటుంబీకులు ఆదివారం ఉదయం ప్రమాదస్థలానికి చేరుకున్నారు. మృతులు దేవానీ గొనాహ్‌లో తమ బావ ఇంటివద్ద చాత్ పూజ చేసుకుని ఇంటికి బయలు దేరారని, రాత్రి ప్రయాణం వద్దని ఉదయం బయలు దేరమని బంధువులు చెప్పినా వినిపించుకోలేదని పోలీసులు వివరించారు.చెరువు లోంచి క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు.ప్రమాదంపై పోలీస్ దర్యాప్తు సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News