Monday, December 23, 2024

సైబరాబాద్‌లో నలుగురు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి స్టిఫెన్ రవీంద్ర గురువారం ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నర్సింగరావును కమిషనర్ ఆఫీస్‌కు అటాచ్డ్ చేశారు. సిసిఎస్ మాదాపూర్‌లో పనిచేస్తున్న సురేందర్‌ను కూకట్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్‌గా నియమించారు.

జగద్గిగిరిగుట్ట ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న పి.సైదులు సిపిఓ క్రైం విభాగానికి అటాచ్డ్ చేశారు. రాజేంద్రనగర్ అడిషనల్ ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.కాంత్రి కుమార్‌ను జగద్గిరిగుట్ట ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. బదిలీ అయిన వారు వెంటనే తమ స్థానాల్లో చేరాలని ఆదేశించారు. రెండేళ్ల గడువు పూర్తి కావడంతో ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News