Wednesday, January 22, 2025

హర్యానాలో నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Four Khalistani terrorists arrested in Haryana

చండీఘ‌డ్‌: హర్యానాలోని కర్నాల్‌లో నలుగురు అనుమానిత ‘ఖలిస్తాన్’ ఉగ్రవాదులను గురువారం అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ తో సంబంధానలున్నట్లు సమాచారం. తెలంగాణ, పంజాబ్, హరియాణాలో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కార్నాల్ టోల్ ప్లాజా వద్ద అనుమానిత కారును తనిఖీ చేశారు. కారులో భారీగా ఆయుధాలు, పేలుడుపదార్థాలు లభ్యమయ్యాయి. వాహనంలో ఇఈడిలు, ఆర్డీఎక్స్, 30 కాలిబర్ పిస్టళ్లు లభ్యమయ్యాయి. వాహనంలోని నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నలుగురు పంజాబ్ కు చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఆయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు సమాచారం.

నిందితుల నుంచి కీలక సమాచారాన్ని హరియాణా పోలీసులు రాబట్టారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలను దేశ సరిహద్దుల నుంచి తెచ్చినట్టు విచారణలో వెల్లడైంది. నలుగురు నిందితులను పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపీందర్‌లుగా గుర్తించారు. ఆయుధాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ముఠా తెలిపింది. “ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిండా డ్రోన్ ఉపయోగించి ఆయుధాలను గాలిలోకి జారవిడిచారు” అని ఒక అధికారి తెలిపారు. ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ఉన్నతాధికారి తెలిపారు. అరెస్టయిన నలుగురితో పాటు, పాకిస్తాన్‌కు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ) ఉగ్రవాది, హర్విందర్ సింగ్ రిండా, బటాలాకు చెందిన రాజ్‌వీర్ సింగ్ కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News