Sunday, January 19, 2025

ఇంటిపై కప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Four killed as roof of house collapses in Punjab

పాటియాలా : పంజాబ్ పాటియాలా లోని ధనక్ బస్తీ జాఖాల్ రోడ్‌లో ఇంటిపై కప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను రాజు, సునీత, అమన్, ఉషాగా గుర్తించారు. గాయపడిన 15 ఏళ్ల వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు ఇంటి పైకప్పు కూలింది. బాధిత కుటుంబం పది నెలలుగా ఈ ఇంట్లో ఉంటోంది. అంతా నిద్రిస్తున్న సమయంలో ఘటన జరగడంతో తప్పించుకోడానికి మార్గం లేకుండా పోయింది. శిధిలాల కింద చిక్కుకున్న వికాస్‌ను స్థానికులు అధికారుల సహాయంతో పట్రాన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News