మన ప్రతినిధి: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఘో ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు మృ త్యువాత పడ్డారు. ఒకరు తీవ్ర గాయాలపాలై ప్రా ణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వ రంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ సం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాద ఘటనకు కారణాలను పరిశీలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వలనే ప్రమాదం జరిగి ఆరుగురు వ్యక్తు లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. బతుకుదెరువు కోసం బీహర్ నుంచి వచ్చిన వలస కూలీలు స్థానికంగా ఊరురు తిరుగుతూ తేనె పట్టును అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న
ఆటోను తొర్రూరు వైపు నుంచి వరంగల్‌కు వస్తున్న లారీ వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా ఇద్దరు మృతి చెందగా, అమర్ అనే వ్యక్తి చావు బతుకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మృతుల్లో ఆటో డ్రైవర్ వరంగల్ శివనగర్‌కు చెందిన బట్టు శ్రీనివాస్, మిగతా ఐదుగురిలో జాబోద్, సురేష్ బీహార్, నితీష్, మేరీ బీహార్, రూప్చంద్లుగా గుర్తించారు. వీరంతా తేనె అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిపి వివరించారు.