Sunday, December 22, 2024

మోటార్‌సైకిల్‌ను ట్రక్ ఢీకొని నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మధ్య ప్రదేశ్ హర్దా జిల్లాలో ఒక ట్రక్ తమ మోటార్‌ సైకిల్‌ను ఢీకొన్నప్పుడు నలుగురు వ్యక్తులు మరణించారని, వారిలో ఇద్దరు సోదరులు అని పోలీసులు శనివారం వెల్లడించారు. జిల్లా కేంద్రానికి సుమారు 16 కిలో మీటర్ల దూరంలోని తిమర్ని ప్రాంతంలోని ఉరా, ఖిడ్కీవాలా గ్రామాల మధ్య రోడ్డుపై శుక్రవారం రాత్రి ప్రమాదం సంభవించిందని అధికారి ఒకరు తెలిపారు. మృతులు గౌతమ్ కౌశల్ (21), అతని తమ్ముడు ప్రీతమ్ (19),

జనైద్ ఖాన్ (18), యశ్‌రాజ్ మండ్లేకర్ (19) మోటార్‌సైకిల్‌పై హర్దా నగరం దిశగా వెళుతున్నారని పోలీస్ సబ్ డివిజనల్ అధికారి అకంఝ తలైయా ‘పిటిఐ’తో చెప్పారు. ఎరువులు రవాణా చేస్తున్న ట్రక్ ఎదురుగా వస్తూ మోటార్‌సైకిల్‌ను ఢీకొని పల్టీ కొట్టిందని, డ్రైవర్ పరారయ్యాడని ఆయన తెలిపారు. మరణించిన అన్నదమ్ముల బంధువు రాజేశ్ కౌశల్ వారిద్దరు తమ కుటుంబాలకు చెప్పకుండానే ఏదో పనిపై తిమర్ని నుంచి హర్దాకు బయలుదేరారని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News